Best Ugadi Wishes in Telugu

Updated On:
ugadi wishes in telugu

Ugadi Wishes in Telugu – ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సర పండుగ, ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బాగా జరుపుకుంటారు. “ఉగాది” అనే పదం సంస్కృతంలోని “యుగాది” నుండి వచ్చింది, ఇందులో “యుగ” అంటే సంవత్సరం, “ఆది” అంటే ప్రారంభం అని అర్థం. అందువల్ల ఉగాది అంటే కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటాము. ఈ పండుగ చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది, సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరుగుతుంది. ఈ రోజున సూర్యుడు మీనా రాశి నుండి మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల దీన్ని సౌర యుగాది అని కూడా అంటారు. ఈ పండుగలో ముఖ్యంగా ఉగాది పచ్చడికి ప్రాధాన్యత ఉంది, దీనిని ఆరు రుచులతో తయారు చేస్తారు, ఇవి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తాయి. బెల్లం తీపిని, చింతపండు పులుపును, మిర్చి కారాన్ని, నీళ్లను భయాన్ని, వేప పూత వగరును, ఉప్పును సమతుల్యతను సూచిస్తాయి.

ఉగాదికి ఇంటిని శుభ్రపరచడం, ముగ్గులు వేయడం, మామిడాకులతో తోరణాలు కట్టడం మన ఆనవాయితీ. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడతాయి. ఈ రోజున పులిహోర, పాయసం, గారెలు వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు, ముఖ్యంగా Ugadi పచ్చడిని తినడం అనవాయితీ. ఈ పండుగ వసంత ఋతువును ఆహ్వానిస్తూ, భారతీయ కాలమానం ప్రకారం కొత్త సంవత్సరాన్ని సూచిస్తుంది. తెలుగు, కర్ణాటక ప్రజల ప్రధాన పండుగ అయిన ఉగాది కొత్త ఆశలు, సంతోషం, సమృద్ధితో నిండిన రోజు. మనం గతాన్ని విడిచిపెట్టి, భవిష్యత్తును స్వాగతించే ఈ శుభ సందర్భంలో “మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు!

Ugadi Wishes in Telugu

మన జీవితాలకు బలమైన పునాది ఉండాలి..

ఈ కొత్త సంవత్సరంతోనే దానిని మొదలుపెట్టాలి..

ఉగాది పండుగ శుభాకాంక్షలు!

జీవితంలో వేపలాంటి చేదు పోవాలని..

బెల్లంలాంటి తీపి రావాలని కోరుకుంటున్నాను..

ఉగాది పండుగ శుభాకాంక్షలు!

మీ అన్ని కొత్త కలలు నిజమయ్యేలా..

శ్రీ క్రోధి నామ సంవత్సరం మీకు విజయాలు తీసుకురావాలి..

హ్యాపీ ఉగాది!

మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, సామరస్యం

నిండుగా ఉండాలని కోరుకుంటూ…

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! 🌸

మీ అన్ని కొత్త కలలు నిజమయ్యేలా,

క్రోధి నామ సంవత్సరం మీ జీవితానికి సంతోషం, ఎన్నో విజయాలు తేవాలి!

హ్యాపీ ఉగాది! 🌸🙏

క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం..

కొత్త సంవత్సరంలో మీకు సంతోషం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను..

ఈ సంవత్సరం మొత్తం ఆనందంతో, ఆరోగ్యంతో నిండి ఉండాలని కోరుకుంటూ,

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! 🌸🙏

ugadi wishes in telugu 2025Download Image

మీ జీవితంలో వృత్తి అభివృద్ధి చెందాలి..

ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండటానికి మీ వంతు కృషి చేయండి..

దేవుడు మీకు సమృద్ధిగా ఆరోగ్యాన్ని, సంపదను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఈ ఉగాది పండుగ సందర్భంగా, మీ జీవితం ఆనందంతో నిండి,

విజయాలు మీరాక కోసం ఎదురు చూస్తుండాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది! 🌸

కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం..

అదే ఉగాది పచ్చడి చెప్పే అసలు నిజం..

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!

తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవ‌త్సర శుభాకాంక్షలు!

జీవితం వేప, బెల్లం లాంటిది..

సుఖమూ ఉంటుంది, దుఃఖమూ ఉంటుంది..

ఆనందంగా ఉన్నప్పుడు సంబరపడిపోవద్దు..

దుఃఖంలో ఉన్నప్పుడు కుంగిపోవద్దు..

క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు!

కొత్త సంవత్సరం వచ్చేసింది..

ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో పురోగతిని తీసుకురావాలని,

మీ ఆర్థిక స్థితి బాగుండాలని,

భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!

మీ చుట్టూ ఉన్న చీకటిని వెలుతురుగా మార్చండి..

ఈ ఉగాది మీకు మీ కుటుంబానికి ఆనందం, శాంతి, ప్రశాంతతను కల్పించాలని కోరుకుంటూ

ఉగాది శుభాకాంక్షలు!

ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితానికి మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు! 🌸🙏

ఈ ఉగాది మీ ఆనందాలను రెట్టింపు చేసి,

మీ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చాలని…

మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌸🙏

గడిచిన కాలాన్ని మర్చిపోవాలి. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి.

శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు..!

శ్రీ క్రోధి నామ సంవ‌త్సరం మీకు అన్ని శుభాలూ కలిగించాలని కోరుకుంటూ..

ఉగాది శుభాకాంక్షలు..!

ఈ తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ..

శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు..!

ఈ కొత్త సంవత్సరం మీరు కన్న కలలు నెరవేరేవిధంగా

మీరు అనుకున్నది సాధించాలి..

మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు..!

తీపి, చేదు కలిసిందే జీవితం,

కష్టం, సుఖం తెలిసిందే జీవితం..

ఆ జీవితంలో ఆనందోత్సహాలని

పూయించేందుకు వస్తుంది.. ఉగాది పర్వదినం..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..!

పాత సంవత్సరపు చేదు, తీపి

జ్ఞపకాలను నెమరు వేసుకుంటూ..

కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలో..

మీ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ…

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..!

Best wishes for ugadi 2025 Best ugadi wishes in telugu Ugadi images in telugu

Ugadi festival, marking the start of the New Year for telugu people in Andhra Pradesh, Telangana, and Karnataka, is a time of joy, renewal, and celebration. It symbolizes new beginnings, hope, and the beauty of nature’s cycles. As families come together to celebrate, it is customary to exchange warm wishes of prosperity, happiness, and success. Ugadi wishes often include blessings for good health, abundant wealth, and peace throughout the year. The festival’s spirit encourages everyone to embrace new opportunities, reflect on the past, and look forward to a bright future with optimism and gratitude. May this Ugadi bring new joys, endless opportunities, and a year full of blessings to all!

TagsMotivational Quotes in Telugu Best Love Quotes in Telugu Good Night Quotes in Telugu

Leave a Comment