Garikipati Quotes in Telugu

Updated On:
garikipati quotes in telugu

Garikipati Quotes in Telugu – గరికిపాటి నరసింహారావు గారు తెలుగు సాహిత్యం, సమాజం, రాజకీయాలు మరియు భారతీయ సంస్కృతిపై లోతైన ఆలోచనలు చెప్పిన ప్రముఖ వ్యక్తి. ఆయన మాటల్లో గాఢమైన భావాలు, ప్రతిభ మరియు స్పష్టత ఉండేవి. ఆయన భావాలను తెలియజేసే మాటలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి.

“మనస్సు శుభ్రంగా ఉంచుకుంటే, సమాజం కూడా శుభ్రంగా ఉంటుంది” అన్న ఆయన మాట, మనిషి ఆలోచనల పవిత్రత మరియు సామాజిక బాధ్యతను సూచిస్తుంది. అలాగే, “తెలుగు భాషే మా ఆత్మ” అని ఆయన తన భాషాభిమానాన్ని, సంస్కృతి పట్ల గల ప్రేమను స్పష్టం చేశారు.

Garikipati ప్రవచనాలు సామాజిక చైతన్యాన్ని మేల్కొల్పేవి. ప్రజల జీవితాల్లో స్ఫూర్తిని నింపే ఆయన మాటలు, ఇప్పటికీ అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Garikipati Quotes ని మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పంపి వారిలో చైతన్యం నింపండి.☀

Garikipati Quotes in Telugu

జీవితం ఒక నీటి బొట్టు.

పెనం మీద పడితే ఆవిరైపోతుంది.

తామరాకు మీద పడితే కొద్దికాలం మెరుస్తుంది.

అదే ఆలుచిప్పలో పడితే శాశ్వతంగా ముత్యమై మెరుస్తుంది.

అందుకే జీవితంలో ఏదైనా సరిగ్గా ఎంచుకోవాలి.

గరికిపాటి

సంభాషణా నైపుణ్యం అంటే

దబాయించి, వాదించడం కాదు.

గుబాళించేలా మాట్లాడడం.

గరికిపాటి

జీవితం మనకు అనేక అవకాశాలు ఇస్తుంది.

విజయం నువ్వు దేనిని ఎంచుకున్నావు

అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

గరికిపాటి

గొప్ప వాళ్ళందరూ

మన వాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం.

కానీ మన వాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం…!

గరికిపాటి

నీటిలో పడవ ఉండాలి

కానీ పడవలో నీరు ఉండకూడదు.

అలాగే జీవితంలో జ్ఞపకాలు ఉండాలి కానీ

జ్ఞపకాలతో జీవితం గడిచిపోవద్దు.

గరికిపాటి

బ్రతికినంత కాలం భీష్ముడిలా బ్రతకాలి.

పోతే అభిమన్యుడిలా పోవాలి…!

గరికిపాటి

అందని దానికోసం ఆరాటపడొద్దు.

అందుబాటులో ఉన్న దానిని

చులకన చెయ్యొద్దు.

గరికిపాటి

garikipati quotes in teluguDownload Image

మనస్సును మించిన తీర్థం లేదు

శరీరాన్ని మించిన క్షేత్రం లేదు

అంతరాత్మను మించిన గురువు లేదు

జీవితాన్ని మించిన గ్రంథం లేదు

గరికిపాటి

జీవితం బాగుండాలంటే

పేరులో అక్షరాలు మార్చుకోమనీ,

అంకెలు మార్చుకోమనీ, ఇల్లు మార్చమనీ,

ఇలవేలుపుని మార్చమనీ చెబుతారు..

కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు…

గరికిపాటి

ఆందోళన లేకుండా ఉండాలంటే

పనులు వెంటనే చేయాలి.

ఆలోచనలు వాయిదా వెయ్యాలి.

గరికిపాటి

సహజంగా లేనివాడు పేదవాడు

ఎంతవున్న సరిపోనివాడు దరిద్రుడు…!

గరికిపాటి

కోరితే గౌరవం రాదు.

ప్రాకులాడితే ప్రాధాన్యం రాదు.

గరికిపాటి

మనం ప్రేమించిన వాళ్ళకంటే

మనల్ని ప్రేమించినవాళ్లే చాలా ముఖ్యం మనకు.

గరికిపాటి

ధర్మం దానంతట అదే గెలుస్తుంది అనుకుంటే పొరపాటు.

మనం కృషి చేసి ధర్మాన్ని గెలిపించాలి. అందుకే

మనకు భగవంతుడు శక్తి, యుక్తులు ఇచ్చింది.

గరికిపాటి

garikipati telugu quotesDownload Image

నాలుగేళ్ల పిల్లోడిని మనం పెంచలేక

హాస్టల్లో పారేస్తున్నప్పుడు, వాళ్ళకి నలభై ఏళ్ళు

వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే

తప్పు ఏమైనా ఉందా?

గరికిపాటి

ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు ఉంటాయో

చెయ్యాలని సంకల్పిస్తే అంతకుమించి

సాధనాలు ఉంటాయి.

గరికిపాటి

మహారాజునైన మట్టిలోనే పూడ్చేది.

సంపన్నుడినైనా స్మశానానికి పంపేది.

అహంకారం ఆవహించినపుడు

ఇది గుర్తుంచుకుంటే చాలు.

గరికిపాటి

వ్యర్థ ఆలోచనలు చుట్టాల వంటివి.

పట్టించుకుంటే ఉంటాయి.

పట్టించుకోకపోతే ఉండవు.

గరికిపాటి

ఎటువంటి పరిస్థితుల్లోనూ మనిషి

తన ప్రతిభని వదిలేసుకోకూడదు.

తన కాళ్ళమీద తాను నిలబడి, క్రిందపడ్డా లేస్తూ

తనని తాను ప్రతిభావంతుడినని నిరూపించుకోవాలి…!

గరికిపాటి

Garikipati Quotations in Telugu Best Quotes for Garikipati Garikipati Telugu Quotes

TagsSri Rama Navami Wishes in Telugu Marriage Day Wishes in Telugu Motivational Quotes in Telugu Ugadi Wishes in Telugu Garikipati Official

Leave a Comment