Best Love Quotes in Telugu – ప్రేమ అనేది ఒక హృదయం యొక్క భాష. కానీ ప్రతి భాష దానికి తనదైన ప్రత్యేకతను తెలియచేస్తుంది. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు భాషలో, ప్రేమను కవిత్వం, పాటలు, మాటల ద్వారా వ్యక్తం చేసే ఒక అందమైన సంప్రదాయం ఉంది. మీరు మీ భాగస్వామికి ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే లేదా ప్రేమ యొక్క అసలైన సారాంశాన్ని తెలియచేయాలనుకుంటే, Best Love Quotes in Telugu అనేది ఒక శాశ్వత ఆకర్షణ.
ఈ బ్లాగ్ పోస్ట్‌లో, మీతో పంచుకోవాలనుకుంటున్న కొన్ని అత్యంత హృదయాన్ని తాకే, ఆలోచనాత్మకమైన Telugu Love Quotes అందించాము. ఈ కోట్స్ ప్రేమ యొక్క సారాంశాన్ని మాత్రమే కాకుండా, తెలుగు భాష యొక్క కవితాత్మక సౌందర్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.
మీరు మీ ప్రియమైన వారి మనసు గెలవాలనుకుంటున్నారా? అయితే ఈ మధురమైన ప్రేమ సందేశాలను (Love Quotes) మీ ప్రియమైన వారికి పంపడం ద్వారా వారి మనసు సులభంగా గెలవచ్చు!🥰
Best Love Messages in Telugu
మనసు అందరిని ఇష్టపడదు.
ఒకసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు!🥰
ప్రతిరోజూ నిన్ను కలవలేకపోవచ్చు కానీ…
ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటాను!
ప్రతి నిమిషం నీతో మాట్లాడలేకపోవచ్చు కానీ…
నీతో మాట్లాడే నిమిషం కోసం ఎదురుచూస్తూనే ఉంటాను!💕
నాకంటూ ఉన్న ఒకే ఒక ఆనందం
“నువ్వు“
లవ్ యు బంగారం!🥰🫶
నీతో మాట్లాడకుండా ఎంత సేపు ఉంటానో
తెలియదు కానీ…
నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను!
మిస్ యు బంగారం!🫶
ఏ రిలేషన్ అయినా సరే…
ఇద్దరు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నపుడే
ఆ రేలషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది!🫂
జతగా నాతో నడిచే అదృష్టం నీకు లేదేమో కానీ
జీవితాంతం నిన్ను ప్రేమించే ప్రేమ నాలో ఉంది…!🫂💕
మాట ఇవ్వడం ముఖ్యం కాదు
ఎలాంటి పరిస్థితులు వచ్చినా
ఆ మాట నిలబెట్టుకోవడం ముఖ్యం…!
ప్రేమ అంటే
ప్రే – ప్రేమించిన వారిని
మ – మరణించేవరకు
ప్రేమించడం…!💕
చెప్తేనే తెలిసేది ఇష్టం
చెప్పాలనుకున్న, చెప్పలేనిది
చెప్పకపోయినా తెలిసేదే
“ప్రేమ“💕
వస్తారని ఎదురుచూడటం ఆశ
రారు అని తెలిసినా కూడా ఎదురుచూడటం ప్రేమ!🫂
ప్రియా నువ్వే నా ప్రాణం
నువ్వే నా జీవం
నువ్వే నా లోకం
నువ్వే నా గమ్యం
నువ్వే నా సర్వస్యం..!💕
నాలో నువ్వు
నా ఆనందంలో నువ్వు
నా ఊహల్లో చిత్రం నువ్వు
నా గుండెల్లో చప్పుడు నువ్వు
నేను అనే పదానికి అర్ధం నువ్వు…!💕
నువ్వు లేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా..
అయితే ఒక్కసారి కళ్లు మూసుకొని చూడు..
అప్పుడు కనిపించే ఆ చీకటే నువ్వు లేని నా జీవితం…!🫂
ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో
ఒకరిచేత ప్రేమించబడడం కూడా అంతే గొప్ప.
నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం…!🫶
గుండె మాత్రం నాదే!
కానీ అది చేసే చప్పుడు మాత్రం నీదే…! 🫶
మరచిపోవటానికీ నువ్వు నా గతం కాదు…
జ్ఞాపకం!💕
నిన్ను చూడాలని తపించే
కనులకు ఎలా చెప్పను…
నువ్వు నాలోనే ఉన్నావని!💕
నువ్వు దగ్గర ఉంటే
గొడవపడాలి అనిపిస్తుంది.
దూరం అయితే దగ్గర కావాలనిపిస్తుంది.
ఎలా అయినా నీతో ఉండాలనిపిస్తుంది!🫂💕
నిన్ను మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా
నేను ఓడిపోతూనే ఉన్నా. అప్పుడే నాకు అర్థమైంది.
మర్చిపోవడానికి నువ్వు మరపువు కాదు…నా మనసువి అని!🥰
సమయం ఉన్నపుడు మాట్లాడేది పరిచయం.
సమయం చేసుకుని మాట్లాడేది బంధం…!🫂
భారమనుకునే హృదయం
ఏనాడూ ప్రేమించదు.
ప్రేమించిన హృదయానికి
ఏనాడూ భారం కాదు…!💕
నేను నీ గురించి చెప్పడానికి
ఎన్నో మార్గాలు అన్వేషించాను.
అయినా దొరకలేదు…
కానీ ఇప్పటికీ ప్రేమిస్తున్నాను…!💕🫂
నా హృదయం, ఆత్మ, భావాలు
అన్నీ నీకోసమే…
బేబీ ఐ లవ్ యూ!💕
జీవితంలో నీ నుంచి నాకు
కావాల్సింది నీ నవ్వు మాత్రమే.
ఆ నవ్వు కోసం ఎన్ని కష్టాలైనా పడతా!🫂
ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో
ఒకరిచేత ప్రేమించబడడం కూడా అంతే గొప్ప.
నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు
నాకు దొరకడం నా అదృష్టం!
నీపై ఉన్న ప్రేమను చెప్పాలంటే ఒక్క క్షణం చాలు!
చూపించాలి అంటే ఈ జన్మ చాలదు..!
లవ్ యు బంగారం!
ప్రేమకు అంతం లేదు..!
అంతమైతే అది ప్రేమ కాదు.
నేనంటే నీకు ప్రేమే కావచ్చు
కానీ నువ్వంటే నాకు ప్రాణం బంగారం.
కాలాలు మారినా
కలలు కనుమరుగయినా
కవితలు అంతమయినా
నేను ప్రాణాన్ని వీడినా
గాలినై మల్లి వస్తాను
నీ ప్రేమ కోసం!
దేవుడు ప్రేమించే మనసు అందరికి ఇస్తాడు..
కానీ ప్రేమించిన మనిషిని కొందరికే ఇస్తాడు.
నాకు నీతో ఇలా జీవించాలి
అలా జీవించాలి అని ఆశ లేదు.
నీ కోసం జీవించాలి నీతోనే జీవించాలి.
ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు.
నువ్వు ప్రేమించడానికి ఎంత మందైన దొరుకుతారు.
కానీ నిన్ను ప్రేమించేవాళ్ళు దొరకడం నీ అదృష్టం.
అందరూ ఎదో ఒక దానికి బానిస అవుతుంటారు…
నేను మాత్రం నీ ప్రేమకు బానిస అయ్యాను!💕
మనం ఒకరి మీద కోపం చుపిస్తున్నామంటే
అది మనకు వాళ్ళ మీద ఉన్న పిచ్చి ప్రేమ…!🫂
సంతోషంలో దగ్గరయ్యే బంధం
కొంతకాలమే ఉండొచ్చు… కానీ
బాధల్లో దగ్గరైన బంధం కడవరకూ ఉంటుంది…!🫶
నువ్వు నాకోసం పుట్టకపోవచ్చు
కానీ నా ప్రేమ పుట్టుకకు కారణం మాత్రం నువ్వే…!
లవ్ యు డియర్!💕🫂
అందమైన వారు అడుగడుగునా ఉంటారు
కానీ అందమైన మనసున్న వారు కొందరే ఉంటారు!💑
Best Love Quotes in Telugu
Love is a timeless and universal emotion that transcends borders, cultures, and ages. Whether it’s a romantic relationship, the love between family members, or even the bond you share with your best friend, love has a way of making life brighter and more meaningful. One of the best ways to express and celebrate love is through words. Quotes about love can inspire us, bring us joy, and remind us of the beauty that exists in our hearts.
Here are 100+ beautiful love quotes to inspire your heart and keep the spark alive in your relationships.
Tags – Good Night Quotes in Telugu Good Morning Quotes in Telugu Birthday Wishes in Telugu Pinterest