100+ Life Changing Motivational Quotes in Telugu

Updated On:
motivational quotes in telugu

Motivational Quotes in Telugu – జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎదుర్కొనే సవాళ్లు, ఆనందాలు, బాధలు అన్నీ మనల్ని మరింత బలంగా మరియు అర్థపూర్వకంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు, జీవితం మనల్ని అలసటకు గురిచేసి, ముందుకు సాగడానికి ధైర్యం కావాల్సిన సమయం వస్తుంది. అలాంటి సమయాల్లో, Motivational Quotes మనలోకి కొత్త శక్తిని పంపుతాయి, మనల్ని మళ్లీ లేచి నిలబడేందుకు సహాయపడతాయి. ఇక్కడ మీకోసం కొన్ని Motivational Quotes ని తెలుగులో అందజేస్తున్నాం.

మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ inspirational Quotes ని షేర్ చేసి వారి జీవితాల్లో స్ఫూర్తి నింపండి.

Best Motivational Quotes in Telugu

జీవితం సైకిల్ ప్రయాణం లాంటిది.

అదుపు తప్పకుండా ఉండాలంటే

తొక్కుతూనే ఉండాలి…!🚴🏻

సంపదలెన్ని ఉన్నా…తృప్తి లేని జీవితం వ్యర్థం.

పూరి గుడిసె బ్రతుకైనా

కంటి నిండా నిద్రపోయే ఆ మనిషి జీవితం ధన్యం!

దేవుడు మనకు విజయాలనందివ్వడు

విజయానికి కావలసిన శక్తి మాత్రమే ఇస్తాడు!

మనిషి మంచిని చెడుగా మార్చుకున్నంత తేలికగా

చెడుని మంచిగా మార్చుకోలేడు…!

ఆవేశపరుడితో నీ ఆలోచనలు పంచుకోకు.

అసూయపరుడితో నీ అభివృద్ధిని చెప్పుకోకు.!

అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి.

అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది.

పగలు తల దించుకునేలా చేస్తుంది…!😥

కోపం హద్దులు దాటుతున్నపుడు

మాటలతో సమాధానం చెప్పకండి.

మీ మౌనానికి మించిన బలమైన సమాధానం

మరొకటి లేదు!

మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ

ఓడిపోడు.

చెడ్డవాడు మొదట సుఖపడొచ్చు కానీ

ఓడిపోతాడు!

ఈ ప్రపంచంలో ఎక్కువగా

ఎవరిమీదా ఆధారపడకు.

నువ్వు చీకట్లోకి వెళ్తే

నీ నీడ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది!

ఇతరులు జాలిపడేలా

మనం బ్రతకకూడదు.

అసూయపడేలా బ్రతకాలి!🤾‍♂

ప్రతి మిడిల్ క్లాస్ వాడు

ఒకే ఒక ఆశతో బ్రతుకుతాడు.

అదే…!

మనకు టైమ్ రాకపోతుందా అని…🤵🏻

పాము కోరల్లో విషం కన్నా

మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం!

నలుగురికి సాయం చేసే గుణమే నీదయితే

నువ్వు ఏ గుడికీ వెళ్ళవలసిన అవసరం లేదు.

నువ్వు నమ్మే థైవం నిన్నే వెతుకుంటూ

నీ ఇంటికే వస్తాడు!

inspirational Quotes in Telugu

మనిషి నాశనానికి ప్రదాన కారణాలు రెండు.

ఒకటి ఎవరో చెప్పింది వినడం.

రెండోది విన్నదాన్ని మరొకరితో చెప్పడం!

నువ్వు పక్కనున్నపుడు ఇచ్చే విలువ కంటే

నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే…

అవతలి వాళ్ళ మనసులో నీ స్తానం ఏంటో తెలియచేస్తుంది!

మనిషి ఎప్పుడూ థైర్యంగా ఉండాలి.

కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి.

అప్పుడే జీవితమంటే భయం ఉండదు.

భవిష్యత్తు అంటే భాధ ఉండదు!

అవసరం చాలా గొప్పది!

మరిచిపోయిన వాళ్ళని కూడా గుర్తుచేస్తూ ఉంటుంది..!

సంపాదించే తెలివి ఉన్నవాడు

పోగుట్టుకున్నదాని గురించి ఆలోచించాడు…

గెలిచే దమ్మున్నవాడు ఓటమి గురించి బాధపడడు..

బలం అయినా, బలహీనత అయినా

అంత నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది.

నవ్వుతూ చేసిన పాపాలు

ఏడుస్తూ అనుభవించక తప్పదు.

కాలం తప్పక సమాధానం ఇస్తుంది!

గౌరవం వచ్చాక గతాన్ని మరువకు.

అవసరం తీరాక

సహాయం చేసినవారిని మర్చిపోకు!

జీవులన్నింటిలో

ఎక్కువగా చంపబడే జీవి కోడి!🐔

ఎందుకంటే…ప్రపంచాన్ని మేలుకోల్పాలని

ప్రయత్నించే ప్రతి జీవి ముందుగా చంపబడుతుంది!

మనస్సులో కత్తులు దాచుకొని,

మాటల్లో పువ్వులు రాల్చే

మనుషులు ఉంటారు జాగ్రత…!

సంపద కలిగిన వాడికి కష్టం వస్తే

ఊరంతా చుట్టాలే…

అదే లేనివాడికి కష్టం వస్తే

ఐన వాడు కూడ పలకరించాడు!

మన తప్పు లేకుండా,

మాట పడాల్సి వచ్చిన రోజు,

ఇంత చేసి ఓడిపోయాం అనిపిస్తుంది.

తప్పదు.. ఓర్చుకోవాలి!

కావాలన్నా తిరిగి రానిది గతం!🕣

వద్దనుకున్నా వచ్చేది మరణం!🛏

ఎంత ఉన్నా చాలనిది ధనం!💰

ఖర్చు పెట్టిన కొనలేనిది ప్రేమ!💔

ప్రేమ విలువ తెలిసినోడిని పిచ్చోడని ..

డబ్బు విలువ తెలిసినోడిని పిసినారని..

అంటుంది ఈ లోకం.

తాతలు సంపాదించిన ఆస్తులుంటే

Rich అంటారు.

ఎలాంటి Background లేకుండా ఎదిగితేనే

King అంటారు…!👑

ప్రపంచంలో 90% ప్రజలు

మరొకరి దగ్గర వారి గొప్పతనం చెప్పుకోవడం కోసం

మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు!

ఎవరినీ చిత్తు కాగితంలా చూడకు.

రేపు ఆ కాగితం గాలిపటం అయితే…

నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది!

పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే

కాసేపు ఏడుస్తారు.

కానీ… సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు!

నువ్వు ఊహించినంత గొప్పగా

నీ జీవితం ఉండాలంటే,

ఎవ్వరూ ఊహించనంత గొప్పగా ఉండాలి

నీ ప్రయత్నం..!

ఎదురుకోవడం, తట్టుకోవడం తెలిసిన వాళ్ళకి

కోలుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు…!

ఆ కాలంలో ఇరుగు, పొరుగు వారంతా

కుటుంబ సభ్యుల్లా ఉండేవారు.

ఈ కాలంలో కుటుంబ సభ్యులే

ఇరుగు, పొరుగు వారిలా మారిపోయారు!

best motivational quotes in telugu

నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను కాపాడుతుంది.

సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను కాపాడుతుంది.

మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను కాపాడుతుంది.

ఓపిక కోల్పోకు..

గెలుపు ఒడ్డుకు చేరే రోజు

దగ్గరలోనే ఉంది.

ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు

కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోకు మిత్రమా..

వాళ్ళని చూసి ఒక చిరునవ్వు ఇవ్వు..☺

ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ల ముఖంపై

నవ్వుని కాల్చివేసేంత గొప్పగా ఉండాలి..!

కలికాలంలో

నిజాలు మాట్లాడేవాడు నీచుడు.

అబద్దలు చెప్పేవాడు ఆప్తుడు.

సహాయం చేసేవాడు సన్నాసి.

మోసాలు చేసేవాడు దేవుడు.

మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు,

దాన్ని ఎదుటివాళ్లకు చెప్పేవాడు

మిత్రుడైనా శత్రువే..!

నేటి సమాజంలో అవసరం ఉన్నపుడు

నువ్వే అంతా అంటారు…

అవసరం తీరాక నువ్వెంత అంటారు!🙏

గొర్రె కసాయి వాడిని

నమ్ముతుందో లేదో తెలియదు కానీ…

మనిషి మాత్రం

మాయమాటలు చెప్పే వారినే నమ్ముతారు!

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు

నిన్ను ఏడిపించిన వాళ్లకి కూడా

బాధపడాల్సిన సమయం వస్తుంది

కాస్త ఓపికపట్టు..

కష్టంతో పొందిన విజయం

స్వర్ణం కంటే విలువైనది.

ఒకరి మోసం బయటపడ్డ తర్వాత

నిలదీయడానికి ప్రయత్నించకు..

ఎందుకంటే, వాళ్లు చేసింది కరెక్టే అని

సమర్ధించుకోవడానికి తిరిగి నీపైనే

నిందలు వేయడానికి ప్రయత్నిస్తారు.

చులకనగా చూసే బంధాల కోసం

ఎప్పుడూ ఆశపడకు..

వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారంటే

అది నీ పై వుండే ప్రేమతో కాదు,

వారి అవసరం కోసం మాత్రమేనని గుర్తుంచుకో…

మనకు శత్రువులు పెరుగుతున్నారంటే

మనం తప్పు చేస్తున్నామని కాదు.

తప్పు చేసే వాళ్లకు

అది తప్పని చెబుతున్నామని..

నచ్చిన పనిని ఎవరికోసం వదులుకోకు,

వచ్చు కదా అని ఏపని ఫ్రీగా చేయకు..

ఒకరికోసం వదులుకునేంత గొప్ప బంధాలు లేవు.

నీ కష్టానికి కృతజ్ఞత చూపించే మనుషులు లేరు..

పిలిస్తే రానివాళ్లు కూడా మనం గెలిస్తే వస్తారు

నీ గెలుపే అన్నిటికీ సమాధానం.

ఈసారి గెలిచి చూపించాల్సిందే…!

ఒక వ్యక్తిని అపార్ధం చేసుకునే ముందు

ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో

గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్ధమవుతాయి.

ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి.

అందుకే గతం మర్చిపోవద్దు.

జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన

సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది.

కానీ ఆ ఒంటరితనమే.. డబ్బు విలువ,

చదువు విలువ, మనుషుల విలువ నేర్పిస్తుంది..!

కొన్నిసార్లు వాదించి బాధ పడడం కన్నా…

తప్పు నాదే అని మౌనంగా ఉండడమే

చాలా మంచిది..!

అన్నీ తెలిసిన వాడే

ఎక్కువ మౌనంగా ఉంటాడు.

ఎందుకంటే వాడు మాట్లాడే

మాట కూడా విలువైనదే…

డబ్బులు ఉంటేనే ఏ బంధానికైనా విలువ..

డబ్బులు ఉన్నవాళ్లు చెప్పే మాటలు భగవద్గీత..

డబ్బులు లేని వాళ్ళు చెప్పే మాటలని

పిచ్చివాళ్లలా చూస్తుంది ఈ లోకం..!

గెలిచాక వచ్చే బంధం కన్నా..

గెలుస్తావు అని నమ్మి…నీతో ఉండే

బంధం చాలా గొప్పది.

అది స్నేహమైన, ప్రేమైనా..!

కస్టపడి పని చేస్తే ఆదాయం

అనవసరంగా ఖర్చు చేస్తే వ్యయం

మౌనంగా ఉంటె రాజపూజ్యం

ఎదురు మాట్లాడితే అవమానం

ఇంతకు మించిన రాశిఫలం ఏమీ లేదు.

ఏదైనా పరీక్షించవచ్చు.. కానీ!

మనిషి సహనాన్ని మాత్రం

పరీక్షించకూడదు.. అది విలువైన

బంధాలను దూరం చేస్తుంది.

కష్టం విలువ తెలిసిన అమ్మాయిని ప్రేమించు,

నీకు ఎన్ని కష్టాలు వచ్చిన కడవరకు నీతోనే ఉంటుంది.

సుఖాలకి అలవాటు పడిన అమ్మాయితో బంధాలని

కలుపుకోకు, తన సంతోషం కోసం నిన్ను ఏమి

చేయడానికైనా భరి తెగిస్తుంది..!

వద్దని విసిరేసిన విత్తనమే

బలమైన వృక్షములా ఎదిగినప్పుడు..

నిన్ను వద్దని వదిలేసిన వాళ్ళని

తలుచుకుంటూ బాధపడకు!!

చెప్పుడు మాటలు చెదలు వంటివి…

చెప్పేవాడు బాగానే ఉండొచ్చు…

విని నమ్మిన వాడే పాడైపోతాడు..!

బంధం ఎప్పటికీ భరించలేనంత

బరువైనది కాదు… విడిపోయేంత విలువ

లేనిది కాదు… భరిస్తే బలం అవుతుంది…

అలాగే అర్ధం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది..!

ఓటమి నీ రాత కాదు

గెలుపు ఇంకొకరి సొత్తు కాదు…

నిన్నని మరిచి, నేటినే తలుస్తూ

శ్రమించు. నీ ఆశయాన్ని సాధించు..!

ఆడంబరాల కోసం చేసే అప్పు

ఆనందం కోసం చేసే తప్పు

మానవ జీవితానికే పెనుముప్పు..!

బాగా గుర్తుపెట్టుకో…

మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు..

మన మాటలకే… ఒకస్థాయి ఉండాలి…!

ఈ ప్రపంచంలో మీకు దక్కిన

తొలి బహుమతి జీవితం..

రెండో బహుమతి మంచి ఆరోగ్యం..

మూడోది ప్రేమ…నాల్గోది ప్రశాంతమైన మనసు

వీటిలో ఏ ఒక్కదాన్ని వృథా చేసుకోకండి..

Motivational quotes are more than just words—they are reminders of our strength, resilience, and limitless potential. Whenever you find yourself struggling, look to these quotes for inspiration. Let them spark the fire of determination within you, and remember that you are capable of achieving greatness.

Keep these words close to your heart, and let them guide you through both the good times and the challenging ones. Success is just around the corner—believe in yourself, stay persistent, and make it happen.

What are your favorite motivational quotes? Share them in the comments below and let’s keep the inspiration flowing!

Tags – Ramzan Wishes in Telugu Good Night Quotes in Telugu Best Love Quotes in Telugu Wish Me Quotes

Leave a Comment