Marriage Day Wishes in Telugu – వివాహం అనేది రెండు హృదయాల మధ్య అనుబంధం, ప్రేమ మరియు విశ్వాసం యొక్క పవిత్ర బంధం. ఈ బంధం సాగుతున్న ప్రతి సంవత్సరం ఒక సంతోషకరమైన జ్ఞాపకార్థంగా నిలుస్తుంది. వివాహ వార్షికోత్సవం అనేది ఈ అద్భుతమైన ప్రయాణంలో ఒక మైలురాయి, ఇది జీవితంలోని ప్రతి సవాళ్ళను ఓడించి, ప్రేమను మరింత గట్టిపరిచే బంధం.
The importance of a marriage day
Wedding Anniversary అనేది కేవలం ఒక రోజు మాత్రమే కాదు, ఇది జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి సంఘటనను జ్ఞాపకం చేసుకునే సమయం. ఇది భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని, ఒకరితో ఒకరు కలిసి ముందుకు సాగిన ప్రయాణాన్ని జరుపుకునే రోజు. ఈ రోజు వారి ప్రేమ, విశ్వాసం మరియు కట్టుబడిన భావాలను మరింత పటిష్టం చేస్తుంది.
The joy of a happy marriage day
Marriage Day కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధువులు కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజున భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు, ఒకరి ఉనికి మరొకరికి ఎంతో ప్రాధాన్యం వహిస్తుందని గుర్తుచేసుకుంటారు. ఈ రోజున చేసే చిన్నచిన్న కార్యక్రమాలు, బహుమతులు మరియు ఆశీర్వాదాలు వారి బంధాన్ని మరింత బలపరుస్తాయి.
మీ ప్రియమైన వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపి వారిని సంతోష పరచడానికి మీ కోసం కొన్ని ప్రత్యేకమైన Wedding Anniversary Wishes ఉంచాము.
Marriage Day Wishes in Telugu
ప్రేమ, అనుబంధంతో కూడిన మీ జీవిత ప్రయాణం
ఇలాగే సుఖమయంగా, శాంతిమయంగా సాగాలని కోరుకుంటూ…
పెళ్లి రోజు శుభాకాంక్షలు! 🌹💏
అనంతమైన ప్రేమ, అనురాగంతో కూడిన
మీ వైవాహిక బంధం ఎప్పటికీ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ…
మీ పెళ్లి రోజున హృదయపూర్వక శుభాకాంక్షలు!💖
మీ ప్రేమ, అనుబంధం ఎప్పటికీ సీతారాముల బంధం లాగా
పవిత్రంగా, అఖండంగా నిలిచేలా ఉండాలని కోరుకుంటూ…
మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు!💐💖
ఇట్లు – మీ శ్రేయోభిలాషి
మీ ప్రేమ వసంతం ఎప్పటికీ వికసించేలా,
మీ దాంపత్య జీవితం సుఖాలు,
సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ…
మీ వివాహ దినోత్సవానికి హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐🥂
మీ ప్రేమ అనంతమైనదిగా,
మీ వైవాహిక జీవితం ఆనందాలు, ప్రేమలతో నిండి ఉండాలని కోరుకుంటూ…
మీ పెళ్లి రోజునకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 💖
నిజమైన ప్రేమ అంటే ప్రతి క్షణం, ప్రతి చూపులో కొత్తగా మలచుకునే అనుభూతి…
మీ ప్రేమ ఇలాగే అనంతమైనదిగా, ప్రతి రోజూ కొత్త ఆనందాలతో నిండి ఉండాలని కోరుకుంటూ…
మీ వివాహ దినోత్సవానికి హృదయపూర్వక శుభాకాంక్షలు! 💖🥂
మీ వివాహం ఆనందం మరియు స్వచ్ఛమైన ప్రేమతో కొనసాగండి!
ప్రేమ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది.
Happy Wedding Anniversary!🥂
అవధులు లేని ప్రేమానురాగాలతో …
మీ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ …
హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు!💑🎉
మీరు ఇలాంటి వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
నలుగురికి మీ జంట
ఆదర్శప్రాయంగా నిలవాలని
ఆ భగవంతుని కోరుతూ!..
Happy Wedding Anniversary!🥂
Wedding Anniversary Wishes in Telugu
సంసారం అంటే కలిసి ఉండటమే కాదు
కష్టాలే వచ్హినా… కన్నీరే వచ్చినా…
ఒకరికి ఒకరు అర్థం చేసుకొని
చివరి వరకు తోడు వీడకుండా ఉండటం.
మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నవ్వుతూ ఉండాలని..
మనస్పూర్తిగా కోరుకుంటూ….
మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..!
తప్పు ఎవరిదైనా కావచ్చు..
ఒక మాట తగ్గి బ్రతకడం లో ఉన్న ఆనందం..
వెయ్యి మంచి మాటలతో సమానం..
మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు…!
నా కోసం ఏదైనా చేసే స్నేహితుడు
ఒక ఇంటి వాడవుతున్న సందర్భంగా
వాడి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
నేను చూసిన భార్యభర్తలలో
మీ జంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది.
అంతటి మంచి జంట అయిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..!
ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం
ఇలాగే ఉండాలని కోరుకుంటూ..
మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..!
మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం..
సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం..
పెళ్ళిరోజు శుభాకాంక్షలు..!
ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట..
నవ్వులే కురవాలి మీ ఇంట..
మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు..!
Best Wishes for Marriage Day Telugu
మీ దంపతులు నిండు నూరేళ్ళు
ఇలానే కలసిమెలసి సంతోషంగా ఉంటూ
ఇలా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ…
సీతా రాముల లాంటి మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
అనురాగం అనే వలయంలో
ఆది దంపతుల ఆత్మీయత అనే గూటిలో
చిలకా గోరింకలై మీ దాంపత్య జీవితం
ఆనంద బృందావనం కావాలని మనసారా కోరుకుంటూ…
మీ దంపతులకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు..!
మమతానురాగాల మీ ప్రేమమయ దాంపత్య జీవితం
ఎన్నేళ్లయినా ఇలాగే ఉండాలని కోరుకుంటూ…
పెళ్ళి రోజు శుభాకాంక్షలు..!
భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలి..
భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి..
అప్పుడే వారి సంసార జీవితం హాయిగా ఉంటుంది.
మీ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..!
మూడుముళ్ల తో ఒక్కటైన మీరు
మూడుకాలల పాటు చిలకా గోరింకల్లా..
ఎప్పుడు సంతోషముగా కలసి మెలసి జీవించాలని..
మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను…
మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
మరో జన్మ ఉంటే
మళ్లీ నీతోనే జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటూ…
వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు..!
నీలాంటి భర్త బహుశా.. మరెవరు ఉండరనే అనుకుంటున్నాను..
ప్రపంచంలో మీకంటే నాకు ఎవరు గొప్ప కాదు.
శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
ఇప్పటి వరకు మన జీవితం ఎంతో ఆనందమయం..
ముందు ముందు మరింత ఆనందంగా మారాలని కోరుకుంటూ…
శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
దేవుడు వరమిస్తే
మరో 1000 సంవత్సరాలు
నీతో బ్రతకాలి కోరుకుంటా..
పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
Wedding Wishes in Telugu
మరో జన్మంటూ ఉంటే,
మీరే నా భర్తగా రావాలని కోరుకుంటాను.
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
మీ ప్రియమైన భార్య!
నువ్వు నా పాలిట దేవతవని
జనాలంటుంటే మురిసిపోతూ ఉంటా..
నువ్వు నిజంగా మన ఇంట్లో దేవతవే…
ప్రియమైన భార్యకి పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
Wedding Anniversary Wishes are a heartfelt way to celebrate the beautiful union of two individuals embarking on a lifelong journey together. These wishes express joy and excitement for the couple as they begin a new chapter in their lives, filled with love, companionship, and shared dreams. Whether from family, friends, or loved ones, marriage day wishes convey blessings of happiness, harmony, and growth in the relationship. They serve as a reminder of the commitment the couple has made to each other and offer encouragement and support for the future, wishing them a lifetime of love and togetherness.
Tags – Wish Me Motivational Quotes in Telugu Good Night Quotes in Telugu Ramzan Wishes in Telugu