Raksha Bandhan Wishes in Telugu – అమ్మ చూపించే ప్రేమ, నాన్న కనబరిచే భద్రత కలిసి ప్రతిబింబించే రూపమే అన్న. రాక అంటే నిండు పున్నమి. ఈ నిండు పున్నమి రోజు ధరించే రక్షకు “రాఖీ” అని పేరు. ఈ రక్షాబంధనంలో దాగిన మూడు పోగుల దారం, మూడు ముడులు—ఆరోగ్యం, ఆయుష్షు, సంపదకు సంకేతాలు.
శ్రావణ మాసపు పౌర్ణమి రోజు రక్షాబంధన్
సోదరి-సోదరుల ప్రేమకు ప్రతీకగా ఈ పండుగ ప్రతీ సంవత్సరం జరుపుకుంటారు. శుభ సమయంలో రాఖీ కట్టినప్పుడు, సోదరుడిపై భగవంతుని ఆశీసులు ఉంటాయని నమ్మకం. రాఖీ కట్టడం అంటే కేవలం చేతికి దారం కట్టడం కాదు—మంత్రోచ్చారణతో, శుభ భావనలతో ఆచరించే పవిత్ర ప్రేమ.
రాఖీలోని రహస్యం
రాఖీ దారంలో ఎరుపు, పసుపు రంగులు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, ఏ శుభకార్యంలోనైనా వేద మంత్రాల ప్రభావం ఉండటం ఆవశ్యకం. అందుకే రక్షాబంధన్ రోజున తూర్పు ముఖంగా సోదరుడిని కూర్చోబెట్టి, బొట్టు పెట్టి, రాఖీ కట్టి, మిఠాయి తినిపించి, హారతి ఇవ్వడం విధిగా భావిస్తారు.
నీ అల్లరే నాకు సంతోషం.
ఎప్పటికీ నువ్వు నవ్వుతూనే ఉండాలి.
నీ కష్ట సుఖాల్లో తోడుగా ఈ అన్నయ్యా ఉన్నాడు.
చిట్టి తల్లికి రక్షా బంధన్ శుభాకాంక్షలు!
నన్ను భుజాల మీదు ఎత్తుకొని పెంచావు.
అమ్మ, నాన్నలా నన్ను సాకావు.
నీ ప్రేమే నాకు కొండంత అండ.
నన్ను దీవించు అన్నయ్యా.
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!
మన మధ్యనున్న ప్రేమ బంధం ప్రతి ఏడాదీ బలపడుతూనే ఉంది.
మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ
రక్షాబంధన్ శుభాకాంక్షలు తమ్ముడు!
ఈ ప్రపంచంలోనే మంచి చెల్లెలు నాకుంది.
నువ్వు లేకుండా నా జీవితం లేదు.
హ్యాపీ రక్షాబంధన్ చెల్లి!
నా జీవితంలో నువ్వు ఎంతో ప్రత్యేకం.
నువ్వు ఎప్పుడూ నవ్వుతూ.. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.
Happy Raksha Bandhan!
నీ లాంటి అక్క ఉండటం నా అదృష్టం.
నువ్వు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ..
Happy Raksha Bandhan!
నా ప్రియమైన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు.
నువ్వెప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని
ఈ రాఖీ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నా.
అమ్మలో అనురాగం..నాన్నలో ప్రేమ
కలగలిపిన బంధం ఇది.
రక్షాబంధన్ శుభాకాంక్షలు!
దరుడిని మించిన ధైర్యం…
సోదరిని మించిన స్నేహితులు ఎవరూ ఉండరు!
Happy Raksha Bandhan!…
అమ్మలా అనురాగం పంచావు..నాన్నలా లాలించావు
నువ్వే నా ధైర్యం అన్నయ్య…
రాఖీ పండుగ శుభాకాంక్షలు!
ఒకే కడుపున పుట్టకపోయినా ప్రేమను పంచిన…
సోదరులు, సోదరీమణులు అందరకీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!
అక్కా, నీ ఆశీర్వాదం నా జీవితానికి దిక్సూచి..
నీ ప్రేమ నాకు ఎల్లప్పుడూ అద్భుతమైన శక్తి..
రాఖీ పండగ శుభాకాంక్షలు!..
అన్నయ్య, నువ్వు నాకు ప్రేరణ, స్ఫూర్తి..
నీ ఆశీర్వాదం నాకు ఎంతో బలం..
రక్షాబంధన్ శుభాకాంక్షలు…
అక్కా, నీ ప్రేమకు నేను ఏమిచ్చినా తక్కువే..
ఈ రక్షాబంధన్ నీకు మరింత ఆనందం, సంతోషం, శ్రేయస్సులు ఇవ్వాలని కోరుకుంటూ..
హ్యాపీ రాఖీ పౌర్ణమి!
అన్నయ్యకు చెల్లెలు ప్రాణం, చెల్లెలికి అన్నయ్య దైవం..
రక్షాబంధన్ శుభాకాంక్షలు..
చెల్లెలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి..
భరోసా ఇవ్వాలని అన్న పడే ఆరాటం.
వీటికన్నా స్వచ్చమైన ప్రేమ ఏమైనా ఉంటుందా..
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!
చెల్లీ..
ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా
ఇరిగిపోని గంధం, చెరగని గ్రంథం
వసివాడని బంధం, మన అన్నాచెల్లెళ్ల అనుబంధం.
రక్షాబంధన్ శుభాకాంక్షలతో నీ అన్నయ్య!