Birthday Wishes in Telugu

Updated On:
Birthday Wishes in Telugu

Birthday wishes in Telugu – పుట్టినరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు, మనం మన ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా వారిని సంతోషంగా అనిపిస్తుంది. మంచి ఆశయాలు, ప్రేమతో నిండిన సందేశాలు, ప్రత్యేకమైన మాటలు, ఆలోచనలను పంచుకుంటూ వారిని సంతోష పరచడం పుట్టినరోజు శుభాకాంక్షల యొక్క ముఖ్యమైన లక్షణం.🎉

ఇక్కడ మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, లేదా మీకు ప్రియమైన వ్యక్తులకు Birthday Wishes తెలియజేయడానికి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన Birthday Greetings అందుబాటులో ఉంచాము!💖

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని..

ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని..

మనసారా కోరుకుంటూ..

పుట్టినరోజు శుభాకాంక్షలు!💖

కోటి కాంతుల చిరునవ్వులతో

భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు

ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

పుట్టినరోజు శుభాకాంక్షలు!💐

నువ్వు ఎల్లపుడు హాయిగా నవ్వుతూ

సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..!🎂💐

నీకు ఎన్నటికీ తరగని

ఆయురారోగ్యములు అష్టఐశ్వర్యాములు

సుఖశాంతులను ప్రసాదిస్తూ

అందరిలో మంచి పేరు తెచ్చుకొనేలా

దీవించమని ఆ దేవుడిని కోరుకుంటూ..

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!🥂

ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ…

నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని

మనస్పూర్తిగా కోరుకుంటూ…

జన్మదిన శుభాకాంక్షలు..!🎂🍰

ఎదుటవారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు.

పుట్టినరోజు శుభాకాంక్షలు!💐

మీ జీవితంలోని ఈ ప్రత్యేకమైన రోజు…

అద్భుతమైన క్షణాలతో నిండిపోవాలని,

ఆనందంగా జీవించాలని కోరుకుంటూ….

పుట్టిన రోజు శుభాకాంక్షలు !💐🎂

నీవు ఎప్పుడైనా అధైర్య పడితే

మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి

ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ..

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

పసిపాప నువ్వులతో,

వెండి వెన్నెల వెలుగులో,

చక్కని చిరునవ్వు సాక్షిగా….

జన్మదిన శుభాకాంక్షలు!🎂

ప్రతి పుట్టిన రోజు మీకు రెట్టింపు సంతోషాన్ని

ఇవ్వాలని కోరుకుంటూ..

హ్యాపీ బర్త్ డే!💐

మీ పుట్టిన రోజుతో పాటు,

మిగిలిన 365 రోజులు కూడా

మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..

పుట్టిన రోజు శుభాకాంక్షలు..!💐

ఈ పుట్టిన రోజు సందర్భంగా…

ఉప్పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని

మనసారా కోరుకుంటూ…

పుట్టిన రోజు శుభాకాంక్షలు!

మీరు అందరికీ పంచిన సంతోషం

తిరిగి మీ దరికి చేరాలని కోరుకుంటూ..

పుట్టిన రోజు శుభాకాంక్షలు..!

మీరు కన్న కలలన్నీ నిజం కవావాలని

ఆ దేవుడిని ప్రార్థిస్తూ..

మీకు జన్మదిన శుభాకాంక్షలు..!💐

birthday greeting in teluguDownload Image

మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా,

సంతోషంగా ఉండాలని కోరుకుంటూ…

హ్యాపీ బర్త్‌డే !💐

భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని,

ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని

మనసారా కోరుకుంటూ…

పుట్టిన రోజు శభాకాంక్షలు..!

దేవుని ఆశీస్సులతో,

తల్లిదండ్రుల దీవెనలతో…

మీ కలలు, కోరికలు నెరవేరాలని కోరుకుంటూ…

జన్మదిన శుభాకాంక్షలు..!

భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని…

ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని

మనసారా కోరుకుంటూ..

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!

జీవితంలో అనుకున్నది సాధిస్తూ..

ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ..

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Birthday wishes for friend in telugu

స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మన స్నేహమైతే..

ఆ స్నేహం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం నువ్వే అన్నది సత్యం.

నీలాంటి స్నేహితుడు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ…

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను..!🍰🥂

స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు..

ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని

నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను.

అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు

జన్మదిన శుభాకాంక్షలు..!🥂

నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి

తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించే నీకు

నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు..!🥂

నేను ఎప్పుడు బాధపడుతున్నా..

నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది

నువ్వే అని నాకు తెలుసు.

అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు..!🥂

నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం.

అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను..!💐

నేను జీవితంలో సంపాదించిన

వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి.

అలంటి నువ్వు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..!🥂

చిన్నప్పటినుండి ఇప్పటివరకు నా వెంటే ఉండి…

నా తప్పులను సరిదిద్దుతూ, ఒప్పులను మెచ్చుకుంటూ…

ప్రతి అడుగులో నాతో కలిసి ఉన్న మిత్రమా…!

నువ్వు నిండు నూరేళ్ళు ఆనందంతో…

చెరగని చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటూ…

జన్మదిన శుభాకాంక్షలు!

మిత్రమా నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు

మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను

పుట్టినరోజు శుభాకాంక్షలు!

బహుమతులు కాదు,

బంధాలు ముఖ్యం.

నా ఆత్మీయ మిత్రుడికి

జన్మదిన శుభాకాంక్షలు.!

ఈ ప్రత్యేకమైన రోజును మరింత ఆనందం,

సంతోషంతో గడపాలని కోరుకుంటూ…

నా బెస్ట్ ఫ్రెండ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు!

జీవితంలో గెలవగలను అన్న ధైర్యంతో పాటుగా

స్ఫూర్తిని కూడా నాలో నింపిన వారిలో నువ్వు ముందుంటావు నేస్తం.

అటువంటి నీవు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని

మనసారా కోరుకుంటున్నాను..!

ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే

అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు

నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Birthday wishes for mother in telugu

దేవుడు అన్నిచోట్లా ఉండలేక…

సృష్టించిన పాత్రే ‘అమ్మ’!

అంతటి గొప్పదైన అమ్మకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎂💐

ఎన్నడూ ఆందోళన దరి చేరనీయకుండా

కంటికిరెప్పలా కాపాడిన అమ్మకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎂💖

అనుక్షణం మా అభివృద్ధి,

శ్రేయస్సు గురించి ఆలోచించే ‘అమ్మ’కి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎂💖

‘అమ్మ’ ప్రేమ తరువాతే ఇంకెవ్వరి ప్రేమ అయినా

అని నాకు తెలిసేలా చేసిన అమ్మకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!💖

ఏ దేశమేగినా..

ఏ తీరం దాటినా..

మరువని మమకారమే ‘అమ్మ’

అలంటి అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు..!💖

Birthday wishes for father in telugu

జీవితంలో ధైర్యం అంటే ఏంటో

నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న.

ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నాకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎉

నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో

మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది.

అలాంటి నిజాయితీని నాకు నేర్పిన నాన్న..

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎉🎁

తండ్రిగా మీరు చూపిన బాట

మాకు పూల బాట. నాన్నా..

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎁

గెలవాలంటే ముందు ప్రయత్నించాలి

అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎈🎉

ఎటువంటి సమస్య వచ్చినా సరే…

ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది

నిన్ను చూసే నాన్న..

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!

Birthday wishes for sister in telugu

నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే

నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క.

అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎂

నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు..

నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో

అండగా నిలిచిన గైడ్ నువ్వు.

అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు

ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎂

నాకు అక్కవి అయినా

ఎప్పుడూ నన్ను నడిపించే

అమ్మగా ఉన్న నీకు

జన్మదిన శుభాకాంక్షలు..!🎂

నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది…

నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి.

ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎂

Birthday wishes for brother in telugu

నిండు నూరేళ్ళు

నువ్వు సంతోషంగా గడపాలని కోరుకుంటూ

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు..!🎂

ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో

నువ్వు విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ..

నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య..!🎉

తండ్రి తరువాత తండ్రి అంతటి పాత్రని

నా జీవితంలో పోషించిన నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య..!🎉

నాన్న లేని లోటుని

మన ఇంటికి ఎవరైనా తీర్చగలిగారు అని అంటే అది

నువ్వే అన్నయ్య. మాకు ధైర్యాన్ని ఇచ్చిన నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎉🎂

నా తమ్ముడి జీవితంలో నా తరువాతే ఎవరైనా!

అంతటి ప్రేమ నాపై కురిపించే వాడికి

జన్మదిన శుభాకాంక్షలు..!🎂

తమ్ముడు …

భవిష్యత్తులో నీవు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి..

దానికి నా వంతు సహాయం తప్పక చేస్తాను.. అని మాటిస్తూ..

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను..!💐💖

తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని

చిన్నవయసులోనే తీసుకుని

ఇంటిని ముందుండి నడిపించావు.

నీ గుండె ధైర్యాన్నీ మెచ్చుకోనివారు లేరు.

ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు..!💖

పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే.

ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

జన్మదిన శుభాకాంక్షలు..!💐

Birthday wishes for wife in telugu

భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టి

మా తల్లిదండ్రులకి కూతురు లేని లోటు తీర్చిన నీకు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!💖

నీ రాక తో నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది.

నా పైన అంతటి ప్రభావం చూపిన ప్రియసఖీ..

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!💖🎉

నా గెలుపులో ఆనందాన్ని

ఓటమిలో బాధని పంచుకునే

నా భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎉🎂

నేను లేని సమయాల్లో

ఇంటిని సమర్ధవంతంగా నిర్వహించే

నా ప్రియమైన భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు.🎂

నా పిల్లలకే కాకుండా

నాకు సైతం తల్లిగా

మంచి విషయాలు చెప్పే నా భార్యకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎂💖

మా ఇంటినే కాకుండా

మా మనసులను కూడా అందంగా

చూపించగలిగే నేర్పు మా ఆవిడ సొంతం..

అంతటి ఓర్పు, నేర్పు కలిగిన మా ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు.💖

ఎల్లప్పుడూ నా కష్టసుఖాల్లో తోడుండే

నీకు జన్మదిన శుభాకాంక్షలు.💖🎉

ఇంటి కోడలిగానే కాకుండా

ఒక కూతురిగా కూడా ఆమె నిర్వహించే పాత్ర అభినందనీయం.

అంతటి సమర్ధురాలైన నా భార్యకి జన్మదిన శుభాకాంక్షలు..!🎉

నా జీవితంలోకి నువ్వు

సరైన సమయంలో రావడంతో

నేను మంచి నిర్ణయాలు తీసుకోగలిగాను అని నిర్మొహమాటంగా చెప్పగలను.

అంతటి సమర్ధురాలైన నా భార్యకి జన్మదిన శుభాకాంక్షలు.🎉💖

నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమనేది

నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం.

అంతటి మంచి జ్ఞాపకానికి కారణమైన నీకు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!💖

Birthday wishes in telugu for husband

పెళ్ళైన తరువాత కూడా

నా కెరీర్‌ని కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించి..

ఎల్లవేళలా నాకు మద్దతునిచ్చే నా భర్తకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!🎉💖

నా ప్రాణస్నేహితుడినే జీవిత భాగస్వామిగా

పొందగలిగే అదృష్టం కలిగించిన మీకు

నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!💐💖

నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించినా సరే…

నన్ను ఓపికగా భరించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.🎉

పెళ్లి, పిల్లలే జీవితం కాదు!

నువ్వనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పెళ్లి అడ్డు కాకూడదు అని..

నాతో ఉన్నత విద్యని అభ్యసించేలా ప్రోత్సహించిన నా భర్తకి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!💖

జీవితంలో లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి.

దాని కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉండాలి అని

నాలో లక్ష్యసిద్ధిని పెంపొందించిన

నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు..!💖

Birthday Wishes in Telugu 2025

నన్ను మీ భార్యగానే కాకుండా

మీ మొదటి బిడ్డగా చూసుకునే మీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు..!💖

నాకు తెలియని ఎన్నో విషయాలను

నా భర్త ద్వారా తెలుసుకోగలిగాను.

నాకున్న సమస్యలని సులువుగా తొలగించే

నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు..!💖

నేను చేసే పొరపాట్లని సరిద్దిదుతూ

ముందుకి నడిపించే నా ప్రియమైన భర్తకి

పుట్టినరోజు శుభాకాంక్షలు..!💐💖

జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా..

దానిని నీవు తట్టుకుని నిలబడగలగాలి అని

నాలో ధైర్యాన్ని నింపిన నా భర్తకి జన్మదిన శుభాకాంక్షలు..!🎉🎈🥳💖

Birthday Greetings in Telugu Birthday Wishes in Telugu

Happy Birthday Wishes! 🎉 I hope this special day brings you all the joy, love, and laughter you truly deserve. May this new year of your life be filled with exciting adventures, wonderful memories, and dreams coming true. You’re such an amazing person, and I feel lucky to know you. Here’s to celebrating YOU today and always—wishing you happiness, good health, and endless blessings in the year ahead! Enjoy every moment to the fullest! 🎂🎈

TagsMarriage Day Wishes in Telugu Ugadi Wishes in Telugu Sri Rama Navami Wishes in Telugu Wiki

Leave a Comment